Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకంటే పెద్దదానివా? అయినా ఫర్లేదు.. గర్భం... ఎస్కేప్

'వయసులో నాకంటే చిన్నోడివిరా... నన్ను ప్రేమించవద్దు... ప్లీజ్‌రా వద్దు' అని చెప్పినా.. ఆ యువకుడు పట్టినపట్టు వీడలేదు. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ముద్దూముచ్చట తీర్చుకున్నాడు. చివరకు పెళ్లిమాటెత్తగానే

Webdunia
సోమవారం, 3 జులై 2017 (16:23 IST)
'వయసులో నాకంటే చిన్నోడివిరా... నన్ను ప్రేమించవద్దు... ప్లీజ్‌రా వద్దు' అని చెప్పినా.. ఆ యువకుడు పట్టినపట్టు వీడలేదు. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ముద్దూముచ్చట తీర్చుకున్నాడు. చివరకు పెళ్లిమాటెత్తగానే పరారయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా శివారు ప్రాంతానికి చెందిన బోడ సురేష్ అనే యువకుడు, అదే ప్రాంతంలోని స్వాతి అనే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కంటే సురేష్ వయసులో చిన్నవాడు. దీంతో వయసులో నా కన్నా చిన్నవాడివి, నీకు నాతో ప్రేమేంటని స్వాతి నిలదీసించి. ప్రేమా లేదు.. దోమా లేదంటూ ఎంతగానో వారించింది. అయినా ఆ కుర్రోడు వినలేదు. చివరికి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లికి ముందే ముద్దూముచ్చట తీర్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ఆమె గర్భం ధరించడంతో, రహస్యంగా తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించాడు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత, పెళ్లి చేసుకోవాలని స్వాతి ఒత్తిడి చేస్తుంటే, తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. తనకు గర్భస్రావం చేయించినప్పటి నుంచి సురేష్ మారిపోయాడని, మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అతని ఇంటి ముందు స్వాతి మౌన పోరాటానికి దిగింది. ఆమెకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. దీంతో సురేష్ కుటుంబీకులు మాత్రం ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments