Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడూ ఆవేశం వద్దు... దేవుడు శాసిస్తాడు నేను వస్తాను... అల్లుడికి కూడా రజినీ సేమ్ డైలాగ్...

ధనుష్‌.. సినిమాల్లో కనిపించనంత కఠువుగా కాకుండా మృదు స్వభావి. మామ రజినీకాంత్‌గా తన పనేదే తాను చేసుకుపోతుంటాడు. అనుకున్న సమయానికి షూటింగ్‌కు రావడం.. షూటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవడం ఇది ధనుష్‌కు అలవా

Webdunia
సోమవారం, 3 జులై 2017 (15:59 IST)
ధనుష్‌.. సినిమాల్లో కనిపించనంత కఠువుగా కాకుండా మృదు స్వభావి. మామ రజినీకాంత్‌గా తన పనేదే తాను చేసుకుపోతుంటాడు. అనుకున్న సమయానికి షూటింగ్‌కు రావడం.. షూటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవడం ఇది ధనుష్‌కు అలవాటు. స్నేహితులని, షికార్లని ఎప్పుడూ టైం వేస్టు చేయకుండా మామను ఫాలో అవుతారు ధనుష్. అందుకే రజినీకాంత్ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. మామ, అల్లుళ్ళ మధ్య మంచి సఖ్యతే ఉంది. రజినీకాంత్ అంటే ధనుష్‌కు ఎంతో గౌరవం. తండ్రితో సమానంగా ఆయన్ను చూస్తుంటారు. 
 
అయితే ఈ మధ్య కాలంలో రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై వార్తలు రావడం.. రజినీకి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉన్న విషయం తెలిసిందే. అయితే తమిళర్ మున్నేట్ర పడై, నామ్ తమిళర్ పార్టీలు రజినీ రాజకీయాల్లోకి రాకూడదని రాద్దాంతం చేయడం.. ఆ తరువాత కొంతమంది సినీ ప్రముఖులు రజినీ స్థానికుడు కాదు. ఆయకు రాజకీయాలు ఏం తెలుసునని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయడం ఇదంతా ధనుష్‌ గమనిస్తూనే ఉన్నాడు. 
 
ఎప్పుడూ కూడా బయటకు వచ్చి ఎవరితోను మామ రాజకీయాల గురించి గానీ వేరే విషయాల గురించి ధనుష్ మాట్లాడనే లేదు. కానీ రాజకీయాల గురించి రజినీ కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించి నిర్ణయానికి వచ్చారు. కానీ రజినీపై విమర్శలు ఎక్కువ కావడంతో ధనుష్‌ సహనం కోల్పోయారట. రెండురోజుల క్రితం రజినీతో సుధీర్ఘంగా మాట్లాడారట ధనుష్. 
 
మామా మీరు అనుకున్న విధంగా రాజకీయాల్లోకి రండి. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ప్రజలకు సేవ చేయండి.. ఇదంతా మామూలే. ఎవరైనా మంచి పనిచేస్తే చాలామందికి ఒప్పదు అంటూ రజినీకి చెప్పారట. ఇప్పటివరకు ఎప్పుడు కూడా రజినీతో ఇంతసేపు ధనుష్ మాట్లాడిన సంధర్భాలు లేవని కుటుంబ సభ్యులే చెప్పుకుంటున్నారు. అలాంటిది రాజకీయాల గురించి రజినీతో ధనుష్ మాట్లాడటంతో రజినీ ఆవేశపడకుండా మెల్లగా సమాధానం ఇచ్చాడట. అన్నింటికీ ఒక సమయం ఉంటుంది. అప్పుడు దేవుడు శాసిస్తాడు... నేను పాటిస్తాను.. అంతవరకు సంయమనం పాటిద్దామంటూ చెప్పుకొచ్చారట.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments