Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికనేర్ వాసులను వణికించిన భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (09:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌ సమీపంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.1గా నమోదైంది. బికనేర్ సమీప ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఉలిక్కపడి లేచి తీవ్ర భయంతో వీధులు, రోడ్లపైకి పరుగులు తీశారు. 
 
బికనేర్ నగారనికి 236 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బికనేర్ అధికారులు చెప్పారు. 
 
కాగా, శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. శుక్రవారం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిఠోరాగడ్ ప్రాంతంలో భూమి కంపిచింది. అంతకుముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వరుస భూకంపాలు పెద్ద భూకంపం వచ్చేందుకు ప్రమాద హెచ్చరికగా ప్రజలు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments