దేశ వ్యాప్తంగా పశువులు "లంపీ" అనే చర్మవ్యాధి బారినపడి విలవిల్లాడుతున్నాయి. దీని బారినపడి ఒక్క రాజస్థాన్‌లోనే దాదాపు 14వేల పశువులు మృతి చెందాయి. లంపీ వ్యాధి చెలరేగిపోతుండడంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం పశువుల సంతలపై నిషేధం విధించింది.
ఈ నెల పదో తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 14వేల పశువులు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో లంపీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు.
రాజస్థాన్ తర్వాత గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్‌లలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. లంపీ చర్మవ్యాధి గోట్‌పాక్స్, షీపాక్స్ కుటుంబానికి చెందినది. కాప్రిపాక్స్ వైరస్ కారణంగా ఇది సోకుతుంది.