ఆఫీసుల్లో వ్యక్తిగత అవసరాలకు కూడా మొబైల్ వినియోగించరాదు : మద్రాసు హైకోర్టు

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (15:43 IST)
ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ వినియోగంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆఫీసుల్లో మొబైల్ ఫోన్ వినియోగించరాదంటూ ఆదేశించింది. అందుకు తగిన విధంగా విధి విధానాలు రూపకల్పన చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అదేసమయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచన చేసింది. 
 
తిరుచ్చికి చెందిన హెల్త్ రీజినల్ వర్క్ విభాగంలో సూపరింటెండెట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి విధి నిర్వహణలో ఉండగానే ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియో తీశాడు. ఉద్యోగులు ఎంతగా వారించినా కూడా సదరు అధికారి వినిపించుకోలేదు. దీంతో ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఉన్నతాధికారులు ఆ అధికారిని సస్పెండ్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించరాదంటూ సంచలన తీర్పును వెలువరించింది. ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాలకు కూడా మొబైల్ ఫోన్ వినియోగించరాదని స్పష్టం చేసింది. 
 
ఈ తరహా నిషేధానికి సంబంధించిన విధి విధానాలను రూపొదించాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా, ప్రభుత్వం రూపొందించే సదరు నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలుజారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments