Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ ఆరోగ్యంపై పిటిషన్.. పబ్లిక్ ఇంట్రెస్ట్‌లా లేదే.. పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌లా ఉంది.. కోర్టు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి పైన అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమ్మ ఆరోగ్యం

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (12:11 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి పైన అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమ్మ ఆరోగ్యంపై వదంతులకు తెరదించుతూ తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వరుస ట్వీట్లు చేశారు.  జయలలిత కోలుకుంటున్నారని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని మాలిని పార్థసారథి ట్వీట్ చేశారు. 
 
జయలలితను ఆసుపత్రిలో పరామర్శించిన అత్యంత సన్నిహితులు ద్వారా ఈ శుభవార్తను తాను వెల్లడిస్తున్నట్లు చెప్పారు. జయలలిత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, ఆమె వ్యక్తిగత నేస్తం ద్వారా తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు, జయ స్పృహలోనే ఉన్నారన్నారు. 
 
ఇదిలా ఉంటే.. జయలలిత ఆరోగ్యంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌లా లేదు... పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌లా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స ఎన్నిరోజులన్నది ఎవరూ చెప్పలేరని పేర్కొంది. ఇలాంటివి రాజకీయాల కోసం వాడుకోవద్దని హితవు పలికింది. జయలలిత ఆరోగ్యంపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ సామాజికవేత్త ట్రాఫిక్‌ రామస్వామి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments