Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి కస్తూరికి తేరుకోలేని షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఇక అరెస్టే తరువాయి!!

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (13:36 IST)
తమిళ సినీ నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు చెన్నై, మదురైలలో కేసులు నమోదైవున్నాయి. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదేసమయంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం ఆమె మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మానసం పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు గురువారం నటి కస్తూరికి తేరుకోలేని షాకిచ్చింది. 
 
కాగా, ఈ నెల మూడో తేదీన చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.
 
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కస్తూరి క్షమాపణలు తెలిపారు. కొంతమందిని ఉద్దేశించి మాత్రమే తానా వ్యాఖ్యలు చేశానని, తెలుగు ప్రజలను ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. అయితే, ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆమె పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమె తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం కస్తూరి హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య నటించిన కంగువ ఎలా వుందో తెలుసా? రివ్యూ రిపోర్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments