Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు నా మెట్టినిల్లు... తెలుగువారంతా నా కుటుంబం : నటి కస్తూరి వివరణ

Kasturi

ఠాగూర్

, సోమవారం, 4 నవంబరు 2024 (13:59 IST)
తెలుగు ప్రజలను తాను అవమానపరచలేదని, కించపరచలేదని సినీ నటి కస్తూరి అన్నారు. పైగా, తెలుగు నా మెట్టినిల్లు అని, తెలుగువారంతా నా కుటుంబ సభ్యులేనని ఆమె పేర్కొన్నారు. తెలుగువారిని తాను అవమానించానంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుడు అర్థాలు తీస్తూ తనపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు డీఎంకే కుట్ర చేసిందని ఆరోపించారు. తెలుగు తన మెట్టినిల్లు అని, తెలుగు వారంతా తన కుటుంబ సభ్యులని కస్తూరి పేర్కొన్నారు. ఈ విషయం తెలియని కొంతమంది మూర్ఖులు తనపై తెలుగు ప్రజలకు ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆమె వరుస ట్వీట్స్ చేశారు. 
 
తాను తెలుగువారిని, తెలుగు జాతిని కించపరిచేలా, అవమానపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించే తెలుగు వారు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరుకుంటున్నా అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అంతఃపురంలో మహిళలకు సేవ చేసేవారు తెలుగు ప్రజలు : తమిళ నటి కస్తూరి 
 
అక్కినేని నాగార్జున - కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన "అన్నమయ్య" చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి, తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలు కస్తూరి తెలుగు ప్రజల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజులు, మహరాజుల కాలంలో సేవకులుగా పని చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 
 
ఆదివారం చెన్నై నగరంలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రసంగించిన కస్తూరి ద్రావిడ సిద్ధాంత వాదులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే తెలుగు ప్రజలను కించపరిచేలా కామెంట్స్ చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారన్నారు. అలా వచ్చిన వాళ్లు ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. 
 
మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని ఎలా అంటున్నారు? ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు. ఇతరుల భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు అని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి చెబుతున్నారు కాబట్టే వారికి వ్యతిరేకంగా తమిళనాడులో ప్రచారం సాగుతోంది అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్‌గా మారాయి 
 
అయితే కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కరుణానిధి పూర్వీకులు తెలుగువారేనని ఎంజీఆర్ కాలం‌ నుంచి ఇది ప్రచారంలో ఉంది. ఇప్పుడు కస్తూరి కూడా ఇన్ డైరక్ట్‌గా తెలుగు వారి పేరుతో ఉధయనిధి‌కు కౌంటర్ ఇచ్చినా తెలుగు వారిని టార్గెట్‌గా మాట్లాడటం వివాదాస్పదం అయింది. 
 
కాగా, తమిళ చిత్రపరిశ్రమలో నటి కస్తూరికి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. చివరకు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఆమెను న్యాయనిర్ణేతగా ఎంపిక చేయడం లేదు. దీంతో అవకాశాల కోసం గత నాలుగేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. కానీ, చెన్నైకు వచ్చిన ఆమె.. తెలుగు ప్రజలను కించపరిచేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ భద్రత మధ్య సల్మాన్ ఖాన్ చిత్ర షూటింగ్