Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై భార్యను - ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్న భర్త...

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (14:56 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భింద్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఒకే వేదికపై భార్యను, ఆమె చెల్లిని పెళ్ళి చేసుకున్నాడో వ్యక్తి. అతని పేరు పరిహార్. వయసు 35 యేళ్లు. కట్టుకున్న భార్య సమ్మతితో ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే వేదికపై తన భార్యకు కూడా మరోమారు మెడలో మూడుముళ్లు వేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భింద్‌ జిల్లాలోని గుడవాలి గ్రామానికి చెందిన దీపు పరిహార్‌(35), వినీత(28) అనే దంపతులు ఉన్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నాడు. అలాగే వినీత కూడా గుడవాలి గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతోంది. 
 
ఈ క్రమంలో పిల్లలను బాధ్యతగా చూసుకునేందుకు వినీతకు కష్టమైంది. పైగా, ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో భార్యను, పిల్లల పోషణ పరిహార్‌కు కష్టమైంది. తన బాధను భార్య వినీతకు వివహించిన పరిహార్.. రెండో పెళ్లి చేసుకుంటానని కోరాడు.
 
దీనికి వినీత సమ్మతించడంతో ఆమెకు చెల్లి వరుస అయిన రచన(22)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం గత నెల 26వ తేదీన జరిగింది. ఆ తర్వాత ఇదే వేదికపై భార్య వినీతకు కూడా మరోమారు తాళికట్టి పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా పరిహార్‌ మాట్లాడుతూ.. వినీత సమ్మతితోనే రచనను తాను పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments