Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ సైట్ల వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయ్ : ఎంపీ మంత్రి భూపేంద్ర సింగ్

దేశంలో లైంగిక నేరాల పెరుగుదలకు గల కారణాలను మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ వెల్లడించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పోర్న్ వెబ్‌సైట్ల వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించా

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:05 IST)
దేశంలో లైంగిక నేరాల పెరుగుదలకు గల కారణాలను మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ వెల్లడించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పోర్న్ వెబ్‌సైట్ల వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఓ లేఖ రాశారు.
 
ఆ లేఖలో పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే రేపిస్టులను ఉరి తీయాలని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును గత నవంబరులోనే ఆమోదించామని గుర్తుచేశారు. గత నవంబరులో తమ రాష్ట్రం చేసిన తీర్మానాన్ని ఆదర్శంగా తీసుకున్న కేంద్రసర్కారు చట్టసవరణ చేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు. 
 
బాలికలపై దాష్టీకాలకు పాల్పడేవారికి సమాజంలో జీవించే హక్కు లేదని, వారిని ఖచ్చితంగా ఉరి తీయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పోర్న్ వెబ్‌సైట్లను తక్షణం నిషేధించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఈ వెబ్‌సైట్లు చూసి, ప్రభావితులైన యువకులు అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు పాల్పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని మంత్రి భూపేంద్ర సింగ్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం