Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడితో అక్రమ సంబంధం.. మేనత్త కోసం పొట్టలో పొడుచుకున్నాడు..

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (11:42 IST)
మేనల్లుడితో అక్రమ సంబంధం కొనసాగించిన అత్త వ్యవహారం ఇది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. అయితే భర్త భార్యను పట్టించుకోకపోవడంతో.. ఆమె 26 ఏళ్ల మేనల్లుడికి దగ్గరైంది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భర్తకు తెలియకుండా శారీరకంగా అతనితో కలిసేది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత భర్తకి అనుమానం వచ్చింది. ఆ పిల్లాడు తనకు పుట్టలేదని అనుమానం పడ్డాడు. భార్యపై ఓ కన్నేసి ఉంచాడు. అయినప్పటికీ అతనికి ఏ విషయమూ తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్నాడు. ఆపై ఆమెను హింసించడం మొదలెట్టాడు. ఓ రోజు రెండు కుమారుడిని తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయింది. 
 
కట్ చేస్తే.. మేనల్లుడి దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆమెకు ప్రత్యేక రూం అద్దెకు తీసుకొని వంటింటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చి డైరెక్టుగా ఆమెతో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భర్తకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నలుగురికీ తెలిస్తే... తన పరువు పోతుందని అనుకున్నాడు. ఇలాంటి విషయాల్లో తెగదెంపుల కంటే... ఏదో ఒక రకంగా నచ్చజెప్పుకొని భార్యను ఇంటికి తెచ్చుకోవడమే మేలనుకున్నాడు. మేనల్లుడి దగ్గరకు వెళ్లాడు. తనను వదిలెయ్యమన్నాడు. కానీ ఇద్దరూ ఒప్పుకోలేదు. 
 
ఇక లాభం లేదనుకున్న భర్త పోలీసులకు కాల్ చేసి మేటర్ చెప్పాడు. అయినా లాభం లేదు. ఇంతలో మేనల్లుడికి దూరం కాకూడదని.. భర్త ముందే కత్తితో గొంతులో కసక్కున పొడుచుకుంది. అది చూసిన భర్త షాక్ అయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న మేనల్లుడు... ఆమె లేకపోతే నేను బతకలేనంటూ... తను కూడా కత్తితో పొట్టలో పొడుచుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments