Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు ఆ బాధ్యత కూడా ఉంటుంది : ఇండోర్ కోర్టు

ఠాగూర్
బుధవారం, 22 మే 2024 (12:16 IST)
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు వృద్ధాప్యంలో కన్నతల్లి ఆలనాపానలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కోర్టు స్పష్టం చేసింది. వయో వృద్ధురాలైన కన్నతల్లికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కోర్టు కుమార్తెను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పును వెలువరించారు. 
 
78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కొవిడ్ విజృంభణ సమయంలో ఇంటి నుంచి కుమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసిన పిటిషనర్ భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది. 
 
ఆమెతో వారసత్వ ఆస్తి అయిన ఇంటిని విక్రయించేలా చేసింది. తండ్రి భవిష్య నిధి ఖాతాలోని డబ్బునూ తీసుకుంది. 2020 మార్చిలో కొవిడ్ వల్ల ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు తల్లిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి తరిమేసింది. కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు వృద్ధురాలు పేర్కొంది. దాంతో తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని, అందువల్ల ఆమె అర్జిస్తున్న ఆదాయంలో నెలకు రూ.3 వేలు చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments