వాడు మానవుడా లేదా రాక్షసుడా.. ఆరేళ్ల చిన్నారిపై రేప్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:12 IST)
కరోనా వంటి ప్రాణాంత వ్యాధులొచ్చి జనాలు మరణిస్తున్నా..కొందరు రాక్షసులు ఏమాత్రం మారట్లేదు. తాజాగా ఓ మానవ మృగం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయటమే కాకుండా బ్రతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా, క్రూరంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోలో బుధవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. దామోకు చెందిన ఆరేళ్ల చిన్నారి స్నేహితులతో కలిసి ఇంటికి కొద్ది దూరంలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే గుర్తుతెలియని ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అప్పటినుంచి పాప కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గురువారం ఉదయం ఇంటికి దూరంగా తీవ్రగాయాలతో పడి ఉన్న పాపను వారు గుర్తించారు.  
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సీనియర్‌ పోలీసు అధికారి హేమంత్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటి వద్ద తీవ్రంగా గాయాలైనాయని.. విచారణను ముమ్మరం చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకునే పనిలో వున్నామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments