Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాగుతున్న నూనెలో చిన్నారుల చేతులు పెట్టించాడు... ఎందుకో తెలుసా?

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపిం

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:30 IST)
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ఐదుగురు చిన్నారులు కాగుతున్న నూనెలో చేతులు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నార్సింగ్‌పాద అనే మారుమాల గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన చంగన్‌లాల్ అనే వ్యక్తి కుమారుడి ఫోన్ చోరీకి గురైంది. తన కుమారుడి ఫోన్ ఎవరు తీశారో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి తన వద్ద పని చేసే చిన్నారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వేడినూనెలో చేతులు కాలకపోతే నిజాయితీపరులని, కాలితే దొంగలని చెప్పాడు. 
 
ఆ తర్వాత మరుగుతున్న నూనెలో ఐదుగురు చిన్నారులతో చంగన్‌లాల్ చేతులు పెట్టించాడు. దీంతో తీవ్రగాయాలైన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో చంగన్‌లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments