Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు తాగేందుకు నిరాకరించిన స్నేహితుడు ... మేడ పైనుంచి ఎత్తి పడేశాడు...

ఠాగూర్
మంగళవారం, 28 మే 2024 (13:23 IST)
తనతో కలిసి మద్యం సేవించేందుకు స్నేహితుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన మరో స్నేహితుడు అతన్ని మేడపై నుంచి ఎత్తి కిందపడేశాడు. ఆ తర్వాత మరికొందరు స్నేహితులు కిందపడిన బాధితుడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. లక్నోలోని రుప్పూర్ ఖాద్రా అనే ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ఘటన మొత్తం బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోలో ఇద్దరు యువకులు డాబాపై పెనుగులాడుతుండగా మరో యువకుడు పక్క నుంచి డాబా ఎక్కుతుండటం కనిపించింది. ఆ ర్వాత పిట్టగోడను గట్టిగా పట్టుకుని రంజిత్‌న మరో యువకుడు అమాంతం పైకెత్తి కిందపడేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. కిందపడిన రంజిత్ బాధతో విలవిల్లాడుతుంటే కింద నిలబడిన మరో ఇద్దరు స్నేహితులు అత్ని కాళ్లతో తన్నగా మరో ఇద్దరు యువకులు చోద్యం చూశారు. ఆ సమయంలో పైనుంచి మరో యువకుడు కిందకు దిగాడు. చివరకు ఓ యువకుడు దాడిని ఆపడంతో వీడియో ముగిసింది. 
 
రంజిత్‌ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఒకే అంతస్తులో ఇంటి పైనుంచి కిందపడటంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స తర్వాత అతన్ని వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments