Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు తిట్టిందనీ... ఆటోలోనే నిప్పంటించుకున్న ప్రియుడు

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:18 IST)
ప్రియురాలు తిట్టందన్న కోపంతో ప్రియుడు ఆటోలోనే నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
ఢిల్లీలోని జ్యోతి నగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన శివమ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన బంధువైన అర్జున్‌తో కలిసి వెళ్తుండగా మార్గమధ్యంలో మరో వృద్ధుడు ఆటో ఎక్కాడు. ఆటో కొద్ది దూరం వెళ్లింది. ఇంతలో శివమ్ కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్ చేశాడు.
 
వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయో తెలియదు కాదనీ... ఇద్దరూ ఫోనులోనే వాదులాడుకున్నారు. కోపంతో ఫోన్ కట్ చేసిన శివమ్ ఆటోను రోడ్డుపై నిలిపి వేశాడు. అనంతరం పెట్రోల్ బాటిల్ తీసి ఆటోలోనే పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ఆ మంటలు ఆటోలో ఉన్న మిగిలిన ఇద్దరికి కూడా అంటుకున్నాయి. 
 
ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు మంటలను ఆర్పి గాయపడిన ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా, శివమ్‌ శరీరం 70 శాతం కాలిపోవడంతో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఇద్దరు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివమ్ ఆత్మహత్యాయత్నంపై దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments