Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన వ్యక్తిని భర్త ముందే పెళ్లాడిన వివాహిత.. బీహార్‌లో హుందాగా నడుచుకున్న గ్రామపెద్దలు..

పెళ్లైనప్పటికీ ప్రేమికుడికి దూరం చేసుకోలేకపోయిన ఓ వివాహితకు భర్త ముందే ప్రియుడితో వివాహమైన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. బీహార్‌లోని గ్ర

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (20:08 IST)
పెళ్లైనప్పటికీ ప్రేమికుడికి దూరం చేసుకోలేకపోయిన ఓ వివాహితకు భర్త ముందే ప్రియుడితో వివాహమైన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. బీహార్‌లోని గ్రామ పెద్దలు హుందాగా నడుచుకున్నారు. ఓ వివాహితకు ఆమె ప్రేమిస్తున్న వ్యక్తితో వివాహం జరిపించారు. పాట్నా‌కి 80 కిలోమీటర్ల దూరంలోని మోతీపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సదరు మహిళకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. రోజూ తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. వరసకు సోదరుడినని చెప్తూ ఇంటికి వస్తుండటంతో ఎవరికి అనుమానం కలగలేదు. కాగా బుధవారం రాత్రి పడకగదిలో వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా ఆమె భర్త చూశాడు. దీంతో గ్రామస్తులు వివాహితతో పాటు ఆమె ప్రియుడిని పట్టుకుని చితకబాదారు. 
 
ఈ వివాదంపై అమ్మాయిని పెద్దలు పంచాయతీ పెట్టగా.. భర్తతో కలిసి ఉండననీ, తన స్నేహితుడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఇందుకు ఆమె భర్త కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో గ్రామ పెద్దలు భర్త సమక్షంలోనే ప్రియుడితో వివాహం జరిపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments