Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క మొగుడిపై మోజు... సొంత అక్కనే పొడిచి చంపేసిన చెల్లెలు....

Webdunia
బుధవారం, 31 జులై 2019 (13:29 IST)
ఆమెకి అక్క మొగుడుపై మోజు కలిగింది. అంతే.. అక్కను అడ్డు తొలగించుకుంటే తనకు బావ సొంతమవుతాడని భావించింది. దానితో ఎలాగైనా అక్కను హత్య చేయాలని పలుసార్లు ప్రయత్నాలు చేసింది. చివరికి ఆమె ప్రయత్నాలు వరుసగా విఫలం కావడంతో ఏకంగా కత్తి తీసుకుని అక్కను విచక్షణారహితంగా గొంతుపైన పొట్టపైన పొడిచి చంపేసింది. 

ఆ సమయంలో బాధితురాలు ఆర్తనాదాలు చేయడంతో ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వచ్చి చూస్తే రక్తపు మడుగులో బాధితురాలు పడి వుంది. అక్కను పొడిచిన చెల్లి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా వారంతా కలిసి ఆమెను పోలీసులకి అప్పగించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కైత్రాలో 27 ఏళ్ల అభిలాషకు గత కొన్ని నెలల క్రితం వివాహమైంది. ఆమె చెల్లెలు 19 ఏళ్ల షతక్షి వీలుచిక్కినప్పుడల్లా అక్క ఇంటికి వెళ్తూ వుండేది. ఈ క్రమంలో ఆమె తన బావపై మోజు పడింది. బావను పెళ్లాడాలని డిసైడ్ అయ్యింది. ఐతే అక్క వుండగా అది సాధ్యం కాదని అనుకుని ఎలాగైనా అక్కను చంపేయాలని ప్లాన్ చేసుకుంది.
 
ఈ క్రమంలో అక్కకు గర్భం రావడంతో పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఇక అదే అదనుగా భావించిన సోదరి... ఆమెను హత్య చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించింది. చివరికి బాత్రూంకి వెళ్లిన సమయంలో కత్తి తీసుకుని ఆమెపై దాడి చేసింది. కనీసం అక్క గర్భవతి అనీ, ఆమె కడుపులో మరో ప్రాణి వుందన్న జాలి కూడా లేకుండా కత్తితో పొడిచి చంపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం