Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. పెళ్లై పిల్లలున్నా ''లవ్'' చిగురించింది..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:06 IST)
ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు. అయితే కళ్లు మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదని.. ఈ జంట నిరూపించారు. వివాహమైనా... ఇద్దరు పిల్లలు కలిగినా.. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ ఆ ప్రేమకు సమాజం అక్రమ సంబంధం అని పేరు పెట్టడంతో పాటు.. నానా రకాలుగా మాటలతో దెప్పిపొడిచింది. చివరికి తమ ప్రేమను బతికించుకునేందుకు ఆ ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవసరి జిల్లా బిలిమొర ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సురిబుజర్గలో 25 ఏళ్ల రంజిత్ జుగ తన కుటుంబంతో అమ్లాసద్ సొసైటీలో నివసిస్తున్నాడు. ఇదే సొసైటీలో స్వాతి భాలియా అనే మరో మహిళ కూడా భర్తతో కలిసి నివసిస్తుంది. రంజిత్, స్వాతిలకు ఇప్పటికే వివాహమైంది. ఇద్దరికీ పిల్లలున్నారు. 
 
ఈ నేపథ్యంలో రంజిత్, స్వాతి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పదినెలలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమాయాణం గురించి సొసైటీ మొత్తం తెలిసిపోయింది. అయితే ఇంట్లో వారు వారిద్దరికీ షరతులు పెట్టారు. 
 
కలుసుకోకూడదంటూ నిబంధనలు పెట్టారు. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చెరిగిపోలేదు. చివరికి సమాజం మాత్రం వీరి ప్రేమను అర్థం చేసుకోలేదని మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments