Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురంలో చేపల వ్యాపారికి కరోనా.. 119 మందికి సోకింది..

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:15 IST)
కేరళ తిరువనంతపురంలో కరనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైంది కేరళలోని పుంథూరా, తిరువనంతపురం గ్రామాల నుంచే అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కేరళలోని సముద్ర తీర గ్రామం పుంథూరాలో 119 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. 
 
ఈ 119 మందికి ఓ చేపల వ్యాపారి ద్వారా కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, అతడిని కలిసిన వారికి పరీక్షలు చేసి 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. దీంతో అక్కడికి ఆరు ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 
 
పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో అక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటాయి. చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments