Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నిజంగానే చారిత్రక విజయం : బీజేపీ గెలుపు అద్వానీ

Webdunia
ఆదివారం, 26 మే 2019 (16:15 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎల్కే. అద్వానీ స్పందించారు. ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న అద్వానీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎల్కే.అద్వానీ స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. ఇది నిజంగా చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చారిత్రాత్మక రీతిలో బీజేపీకి, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చారన్నారు. ప్రజల తీర్పు పట్ల ఎన్డీయేలోని ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారన్నారు. 
 
కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, నరేంద్ర మోడీ నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకోవడం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ నేత ఎన్నిక కార్యక్రమంలో కూడా ఇదే సీన్ పునరావృతమైంది. మోడీ మరోసారి బీజేపీ కురువృద్ధుడి దీవెనలు అందుకున్నారు.
 
కాగా, ఈ నెల 23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 303 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments