Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతంలో పిడుగుల బీభత్సం : 68 మంది మృతి

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:11 IST)
ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. 
 
ముఖ్యంగా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం పిడుగులు పడి 68 మంది చనిపోగా.. భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యూపీలోనే 41 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏడుగురు చ‌నిపోయారు. రాజ‌స్థాన్‌లో పిడుగుపాటుకు 20 మంది మృతి చెందారు.
 
రాజస్థాన్‌లోని వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు లోనై 20 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. జైపూర్ సమీపంలోని అంబర్ కోట వద్ద పర్యాటకులు సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
 
మరోవైపు, యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. పిడుగుపాటు ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, పిడుగుపాటు ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments