Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతపై 60ఏళ్ల వృద్ధుడి ఫైట్.. చివరికి గెలిచింది ఎవరంటే? (video)

ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుతను ఓ వృద్ధుడు ధైర్యంగా పోరాడి తరిమికొట్టాడు. యూపీలోని అడవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామంలోకి చిరుత దూసుకొచ్చింది. 60 ఏళ్ల వృద్ధుడు నివాసం వుంటున్న ఇంట్

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:09 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుతను ఓ వృద్ధుడు ధైర్యంగా పోరాడి తరిమికొట్టాడు. యూపీలోని అడవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామంలోకి చిరుత దూసుకొచ్చింది.

60 ఏళ్ల వృద్ధుడు నివాసం వుంటున్న ఇంట్లోకి దూరింది. అయితే గడపలోనే దాన్ని అడ్డుకున్న వృద్ధుడు.. దానిపై ఎదురుదాడికి దిగాడు. తన చేతిలోని కర్రతోనే తరిమికొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ గ్రామంలోకి ఉన్నట్టుండి పరిగెత్తుకొచ్చిన చిరుత కంటికి కనిపించిన వారిపై దాడికి పాల్పడింది. చివరికి 60 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. అయితే ఆ వృద్ధుడు ఏమాత్రం జడుసుకోకుండా తన చేతిలోని కర్రతో చిరుతపై దాడి చేశాడు. 
 
అది పంజా విసిరినా కర్రతో చావ బాదాడు. చిరుత ఆయన్ని కిందకు తోసేసినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వృద్ధుడు చిరుతపై దాడి చేసి... తరిమికొట్టాడు. చివరికి చిరుత పారిపోయింది. చిరుత దాడితో గాయపడిన వృద్ధుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ వీడియోను వృద్ధుడి పొరుగింటివారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments