Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు చాంబర్‌లో రేప్ చేసిన లాయర్... ఎక్కడ?

తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించే న్యాయవాదులే వక్రమార్గంలో నడుస్తున్నారు. పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉండే ఓ లాయర్.. మరో మహిళా లాయర్‌ను కోర్టులోనే రేప్ చేశాడు. ఇపుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాం

Webdunia
సోమవారం, 16 జులై 2018 (09:56 IST)
తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించే న్యాయవాదులే వక్రమార్గంలో నడుస్తున్నారు. పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉండే ఓ లాయర్.. మరో మహిళా లాయర్‌ను కోర్టులోనే రేప్ చేశాడు. ఇపుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోనే జరగడం మరో విశేషం. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో తన చాంబర్లోనే ఓ మహిళా న్యాయవాదిపై 50 యేళ్ళ న్యాయవాది అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన సమాచారం ప్రకారం మేరకు.. ఈనెల 14వ తేదీ శనివారం రాత్రి సమయంలో సహ న్యాయవాది పూర్తిగా మద్యం సేవించి కోర్టులోని తన చాంబర్‌కు వచ్చాడు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నాను. తాగిన మైకంలో నిందితుడు తనపై లైంగికదాడికి పాల్పడినట్టు పేర్కొంది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి బాధితురాలు సమాచారం తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేశామని, వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి కూడా తరలించినట్లు వెల్లడించారు.
 
దీనిపై ఢిల్లీ సౌత్ డీసీపీ రోమిల్న బానియా మాట్లాడుతూ, లైంగిక దాడి జరిగిన చాంబర్‌‌ను సీజ్ చేశామని.. ఫోరెన్సిక్, క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించాయని చెప్పారు. నిందితుడిని ఆదివారం ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని, తర్వాత సాకేత్ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అయితే ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
మహిళలపై పోలీసులు, లాయర్లే అత్యాచారానికి పాల్పడితే, ఇక రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. మహిళలను కాపాడాల్సిన వారే కాటేస్తున్నారంటూ, తక్షణమే లాయర్‌‌పై కఠినచర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి పేరుతో పాటు... లైంగిక దాడికి పాల్పడిన కామాంధ లాయర్ పేరును పోలీసులు గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం