Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ ప్రారంభం

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:21 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ నేటి నుండి ప్రారంభమయింది. అందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ కేంద్ర  వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నేడు కోవిడ్‌ రెండో వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని తెలిపారు. హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఐసిడిఎస్‌ సిబ్బంది మొదటి డోస్‌ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్‌ కూడా అక్కడే వేసుకోవాలని సూచించారు.

మొదటి డోస్‌ ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోస్‌ కూడా అదే కంపెనీది వేసుకోవాలని తెలిపారు. 28 రోజుల తర్వాత రెండో డోస్‌ వేసుకోవాలని, ఈ నెల 25 లోగా హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఐసిడిఎస్‌ సిబ్బంది మొదటి డోస్‌ వేసుకోవాలని చెప్పారు.

ఈ నెల 25 తర్వాత వీరికి మొదటి డోస్‌ వేయబోరని, ఇదే చివరి అవకాశమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా వీరు ఈనెల 25 లోగా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని తెలిపారు. ఇతర శాఖల సిబ్బంది మార్చ్‌ 5 లోగా మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని అన్నారు.

ఆ తర్వాత వీరికి వ్యాక్సినేషన్‌ ఉండదని  స్పష్టం చేశారు. ఎపి లోనూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో డోస్‌ ప్రారంభమయింది. నేడు 19,108 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లకఁ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేయనున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments