గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై రాంచీ (ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు.
గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై రాంచీ (ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు లోపల ఉన్న న్యాయమూర్తి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు గురువారం శిక్షలు ఖరారు చేయాల్సి వుంది. దీంతో లాలూ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో లాలూ న్యాయమూర్తితో మాట్లాడుతూ... "సర్... జైల్లో చాలా చలిగా ఉంది. కనీసం నన్ను కలిసేందుకు వచ్చిన వారితో కూడా మాట్లాడనివ్వడంలేదు.." అని చెప్పారు.
దీనిపై జడ్జి సీరియస్ అయ్యారు. "మిమ్మల్ని కోర్టుకు పిలిపించింది ప్రజలను కలుసుకునేందుకే. మీకు చలిగా అనిపిస్తే... హర్మోనియమో, తబలానో వాయించుకుని చలిని అధిగమించండి.." అంటూ ఒకింత గట్టిగా చెప్పారు. దీంతో లాలూ కిమ్మనకుండా ఉండిపోయారు.