Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌ను కుక్క కరిచేసింది.. ఎక్కడ?

కుక్క కరిస్తే చాలా ప్రమాదమన్న విషయం తెలిసిందే. అందుకే రోడ్లపై వెళ్తున్నప్పుడు కూడా శునకాలు ఎక్కడ కరుస్తాయోనని జడుసుకుంటూ నడిచి వెళ్తుంటాం. అలాంటిది.. ఎంచక్కా షూటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్న ఓ హీరోయిన

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (12:42 IST)
కుక్క కరిస్తే చాలా ప్రమాదమన్న విషయం తెలిసిందే. అందుకే రోడ్లపై వెళ్తున్నప్పుడు కూడా శునకాలు ఎక్కడ కరుస్తాయోనని జడుసుకుంటూ నడిచి వెళ్తుంటాం. అలాంటిది.. ఎంచక్కా షూటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్న ఓ హీరోయిన్‌ను కుక్క కరిచేసింది. ఒక్కసారిగా కుక్క అటాక్ చేయడంతో ఆ హీరోయిన్ ఆస్పత్రి పాలైంది.
 
శునకం కాటుకు హీరోయిన్ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ముఖంపై మూడు కుట్లు కూడా పడ్డాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. అమీర్ ఖాన్ తలాష్ చిత్రంలో నటించి మెప్పించిన సీరియల్ నటి రీనా అగర్వాల్. కుక్క ఒక్కసారిగా మీద పడి ముఖం కుడి భాగాన్ని కరిచేసిందని.. కుడి కంటికి కింద భాగంలో కుక్క కరించిందని రీనా అగర్వాల్ తెలిపింది. 
 
ఉన్నట్టుండి కుక్కకు ఏమైందో కానీ.. కోకిల ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని రీనా అగర్వాల్ చెప్పింది. ఇప్పటికే వైద్యులు ఐదు ఇంజెక్షన్లు ఇచ్చారని.. నాలుగో రోజులు విశ్రాంతి అవసరం కావడంతో షూటింగ్ వాయిదా పడిందని రీనా తెలిపింది. ఈ గాయాల నుంచి కోలుకునేందుకు నెలవరకు సమయం పట్టవచ్చునని రీనా అగర్వాల్ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments