Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరబలి కేసులో కొత్త ట్విస్ట్ : శరీరాన్ని 56 ముక్కలు చేసి వండి ఆరగించారు...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (17:04 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సిరిసంపదలతో జీవించవచ్చన్న దురాశతో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ బలి తర్వాత మృతదేహాలను ఏకంగా 56 ముక్కలు చేశారు. ఇందులో కొన్ని భాగాలను వంట చేసుకుని ఆరగించినట్టు విచారణ జరుపుతున్న పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్ - లైలా అనే దంపతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వీరు వాటి నుంచి బయటపడడంతోపాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలిసి నరబలికి సిద్ధమయ్యారు. 
 
ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు. పథకంలో భాగంగా గత నెల 26న ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి వారిని బలిచ్చాడు. మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. 
 
బాధిత మహిళలను లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవించే పద్మం (52), రోస్లీ (50)గా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వారు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఆర్థికంగా లాభపడేందుకే నరబలి ఇచ్చినట్టు  చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
 
అయితే, ఈ ఇద్దరు మహిళలను బలిచ్చే ముందు రోజెలిన్, పద్మలను కట్టేసి చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా వారి స్థనాలనుకోసేసి రక్తం ప్రవహింప చేశారని పోలీసులు తెలిపారు. పద్మను షఫీయే గొంతు నులిమి చంపేసి.. ఆ తర్వాత తల తెగనరికేశాడు. ఆ దేహాన్ని 56 ముక్కలు చేశాడని, రోజెలిన్‌ను లైలా కొంతు నులిమి చంపేసిందని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆ మాంసాన్ని షపీ భుజించి వుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments