Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పట్టాలెక్కనున్న తొలి ప్రైవేటు రైలు!!

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (09:02 IST)
దేశంలో తొలి ప్రైవేటు రైలు త్వరలో పట్టాలెక్కనుంది. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ప్రైవేట్ రైళ్ళను నడిపేందుకు అనుమతించిన విషయం తెల్సిందే. దీంతో తొలి ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది. జూన్ నాలుగో తేదీన తిరువనంతపురం - గోవా రాష్ట్రాల మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ఎస్ఆర్‌ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. రైలు ఆధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ రైలును నడుపనున్నాయి. 
 
తిరువనంతపురంలో ప్రారంభమయ్యే ఈ రైలు... త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, కోళికోడ్, కన్నూర్, కాసర్‌కోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది. ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ ఏసీ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ బోగీలు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించవచ్చు. వైద్య నిపుణులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది కూడా ఈ రైలులో అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా ఈ రైలులో టూర్ ప్యాకేజీలను సిద్ధం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments