Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శని జయంతి.. అమావాస్య.. తైలాభిషేకం.. నలుపు రంగు దుస్తులు..?

Advertiesment
Lord Shani

సెల్వి

, సోమవారం, 6 మే 2024 (13:20 IST)
శని దేవుడిని న్యాయ దేవుడిగా, కర్మలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శని దేవుడికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని విశ్వాసం. ఈ నెలలో అంటే మే 7వ తేదీన మంగళవారం నాడు శని జయంతిని జరుపుకుంటారు. 
 
వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 7వ తేదీన మంగళవారం నాడు ఉదయం 11:40 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు మే8వ తేదీన 8:51 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, శని జయంతిని 8వ తేదీన జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుడికి పూజలు చేయడం వల్ల శని మహాదశ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఈ రోజున శనికి తైలాభిషేకం చేయడం.. నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శని దేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. ఇంకా శని మంత్రం, శని చాలీసా పఠించాలి. శనికి నలుపురంగంటే ఇష్టమని అంటారు. అందుకని ఈ రోజు నలుపురంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది. అలాగే నల్లని శునకానికి ఆహారం పెట్టినా కూడా ఆయన ప్రసన్నులవుతారు. ఇంకా శనీశ్వరునికి నువ్వులు లేదా ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-05-2024 సోమవారం దినఫలాలు - నిరుద్యోగులకు ఆశాజనకం...