Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-05-2024 సోమవారం దినఫలాలు - నిరుద్యోగులకు ఆశాజనకం...

Advertiesment
astro6

రామన్

, సోమవారం, 6 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| చైత్ర ఐ|| త్రయోదశి ప.1.14 రేవతి సా.4.41 ఉ.శే.వ.6.58కు ప.దు.12.21 ల 1.12, పు.దు. 2. 54 ల 3.44.
 
మేషం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత బాకీలు తీరుస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృషభం :- ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఆశాజనకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. సభ, సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాబడికి మంచి ఖర్చులు అధికమవ్వడం వల్ల ఆందోళన అధికమవుతుంది.
 
మిథునం :- ఉద్యోగులు పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
సింహం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో విజయంసాధిస్తారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు.
 
తుల :- ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికిరాగలవు.
 
వృశ్చికం :- వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పెరిగిన ధరలు, కుటుంబ ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక లోటుండదు.
 
ధనస్సు :- తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. షాపు గుమస్తాలతో చికాకులు, వినియోగదారులతో మాటపడవలసి వస్తుంది.
 
మకరం :- స్త్రీలకు ఆడంబరాలు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ సంతానం పైచదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కొత్త బాధ్యతలు, స్థానచలన ప్రదేశం ఉద్యోగస్తులకు చికాకు కలిగిస్తుంది. షాపు గుమస్తాలతో చికాకులు, వినియోగదారులతో మాటపడవలసి వస్తుంది. అదనపురాబడి మార్గాలు అన్వేషిస్తారు.
 
కుంభం :- మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఇసుక, క్వారీ, ఆక్వా రంగాల వారికి అభ్యంతరాలెదుర్కోవలసివస్తుంది. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. ప్రయాణం వాయిదా వేసుకోవటం ఉత్తమం.
 
మీనం :- చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో సరిచూసుకోండి. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మానికి ఎందరు భార్యలున్నారో తెలుసా?