Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కేన్సర్... ఆమె కోసం భర్త ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (10:56 IST)
వారిద్దరూ కొన్నేళ్ళపాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇంతలో భార్యకు కేన్సర్ అని తెలిసింది. ఆ భర్త గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ, ధైర్యం కోల్పోలేదు. భార్య కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. భార్య కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అంతే... నిజమైన ప్రేమంటే ఏంటో నిరూపించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్రంలోని త్రిసూరుకు చెందిన షాన్ ఇబ్రహిం బాద్షా, శ్రుతి కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రుతి అనారోగ్యంపాలైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమెకు కేన్సర్ అని వైద్యులు వెల్లడించారు. ఈ భయంకర నిజాన్ని తెలుసుకున్న రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు లోనయ్యాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు కేన్సర్ ఉందన్న విషయం తెలిసి షాన్ తట్టుకోలేకపోయాడు. గుండెలవిసేలా రోదించాడు. 
 
అయితే.. ఆమెను ఎలాగైనా బతికించుకోవాలన్న షాన్ సంకల్పమే శ్రుతికి ఊపిరి పోసింది. శ్రుతికి కేన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ మొదలుపెట్టారు. ఆ చికిత్స ప్రభావంతో శ్రుతి జుట్టు ఊడిపోయింది. ఆ సమయంలోనే షాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఆ స్థితిలో ఉన్నప్పుడు తనకు మాత్రం జుట్టు ఎందుకనుకున్నాడు. అతను కూడా గుండు చేయించుకున్నాడు. 
 
కేన్సర్‌తో బాధపడుతున్న శ్రుతికి షాన్ అన్నీతానై అండగా నిలిచాడు. ఇప్పుడు ఆమె కేన్సర్ నుంచి కోలుకుంది. వీరి పెళ్లయి సంవత్సరం అయిన సందర్భంగా షాన్ తన ప్రేమకథను గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు శ్రుతి తోడుగా నిలిచి భరోసానిచ్చిందని, అలాంటి తన శ్రుతి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని షాన్ చెప్పాడు. ఇలా షాన్-శ్రుతి ప్రేమకథ వెలుగులోకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments