Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీకి సీటివ్వమంటే.. తోటి ప్రయాణీకులే ఇలా చేశారు..?

బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకుల్లో మానవత్వం కనుమరుగైందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లలతో బస్సెకినా, గర్భం దాల్చిన మహిళలు నిల్చున్నా ఏమాత్రం కనికరం లేకుండా తోటిమనుషులు ప్రవర్తిస్తున్నారు. గర్భిణీ మహిళలన

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:40 IST)
బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకుల్లో మానవత్వం కనుమరుగైందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లలతో బస్సెకినా, గర్భం దాల్చిన మహిళలు నిల్చున్నా ఏమాత్రం కనికరం లేకుండా తోటిమనుషులు ప్రవర్తిస్తున్నారు. గర్భిణీ మహిళలను నిల్చున్నా.. వారికి లేచి సీటిచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది.

ఇలాంటి ఘటనే కేరళలోని కన్నూరులో చోటుచేసుకుంది. పుణ్యానికి పోతే ఓ వ్యక్తికి పాపమే ఎదురైంది. బస్సెక్కిన గర్భిణికి సీటు ఇవ్వమని.. కూర్చున్న వారిని అడిగిన ప్రయాణీకుడిపై దాడి జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజన్ (50) అనే వ్యక్తి తన భార్యతో కలిసి వారమ్ బస్టాప్‌లో కన్నూరు వెళ్లేందుకు బస్సెక్కాడు. అదే బస్సులో తాలుక బస్టాప్‌లో ఓ గర్భిణి బస్సెక్కింది. బస్సు రద్దీగా వుండటంతో ఆమె నిలబడేవుంది. దీన్ని గమనించిన రాజన్ తన ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలను పిలిచి గర్భిణికి సీటు ఇవ్వాలని కోరాడు. 
 
అయితే దీన్ని గమనించిన బస్సులోని మిగిలిన ప్రయాణీకులు గర్భిణీ సీటు కోసం వారిని ఎలా లేవమంటారని బస్సులో వాగ్వాదానికి దిగారు. గొడవ మరింత ముదరడంతో రాజన్ దంపతులు బస్సు నుంచి దిగిపోవాలనుకునే లోపే.. బస్సులోని మిగిలిన ప్రయాణీకులు అందరూ రాజన్‌పై దాడి చేసి బస్సు నుంచి కిందికి తోసేశారు. ఈ ఘటనలో గాయాల పాలైన రాజన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments