పేరు పెట్టడానికి కుదరని ఏకభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:58 IST)
కేరళ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. తమ బిడ్డకు పేరు పెట్టేందుకు తల్లిదండ్రుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో కేరళ రాష్ట్ర హైకోర్టే ఆ చిన్నారికి పేరు పెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దంపతుల మధ్య విభేదాలు పొడచూపడంతో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఆ పాపకు పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ వివాదం చివరకు కేరళ హైకోర్టుకు చేరింది. 
 
కేరళకు చెందిన ఓ జంటకు గత 2020 ఫిబ్రవరిలో ఓ పాప పుట్టింది. ఆ తర్వాత దంపతులు విడిగా ఉంటున్నారు. పాప తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడంతో.. ఓ పేరు నమోదు చేసేందుకు తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. 
 
దీంతో ఆ చిన్నారికి దంపతులిద్దరూ వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరూ పట్టు వీడకపోవడంతో.. పాప తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ సమస్యను పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి, పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments