Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మారితే చంపేస్తారా? మా కుటుంబాన్ని కాపాడండి.. ఫేస్‌బుక్‌లో బాలిక.. వీడియో వైరల్

కేరళలో ఓ బాలిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియో.. రాజకీయంగా పెను దుమారం రేపింది. కసరగాడ్ జిల్లాకు చెందిన సుకుమారన్ అనే వ్యక్తి సీపీఎం నుంచి బీజేపీ జంప్ కావడంతో వివాదం మొదలైంది. బాగా పట్టున్న ప్రాంతంలో

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:49 IST)
కేరళలో ఓ బాలిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియో.. రాజకీయంగా పెను దుమారం రేపింది. కసరగాడ్ జిల్లాకు చెందిన సుకుమారన్ అనే వ్యక్తి సీపీఎం నుంచి బీజేపీ జంప్ కావడంతో వివాదం మొదలైంది. బాగా పట్టున్న ప్రాంతంలో సీపీఎం నేత బీజేపీకి మారడాన్ని..సీపీఎం నేతలు జీర్ణించుకోలేకపోయారు. అంతే గురువారం సుకుమారన్ స్కూలు నుంచి కూతురుని తీసుకొస్తుండగా సీపీఎం కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. 
 
కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుకుమారన్ కుమార్తె సీపీఎం కార్యకర్తల ద్వారా తన కుటుంబానికి ముప్పు పొంచి వుందని వీడియో ద్వారా ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. సీపీఎం కార్యకర్తలు తన తండ్రిని చంపేస్తామని బెదిరించారు. తన కుటుంబాన్ని కాపాడండి అంటూ వీడియోలో ఆ బాలిక వేడుకుంది. 
 
అయితే సుకుమారన్ కుమార్తె అశ్విని చేసిన ఆరోపణలను సీపీఎం నేతలు కొట్టిపారేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సుకుమారన్ బలమైన నేతేనని తక్షణమే ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తుంది. సుకుమారన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments