కుమార్తెను గర్భవతిని చేసిన కిరాతక తండ్రికి 101 యేళ్ళ జైలు!

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (17:26 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఆ యువతి శీలంపై కాటేశాడు. పదేపదే లైంగికదాడికి తెగబడటంతో ఆ యువతి గర్భందాల్చింది. ఈ తంతు ఏకంగా ఆరేళ్ళపాటు సాగింది. ఫలితంగా ఆ బాలిక 16 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. కేరళలో ఈ దారుణం జరగ్గా, కామాంధ తండ్రికి మల్లపురానికి చెందిన స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కేసు తీవ్రత దృష్ట్యా అతడికి 101 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్షనూ విధించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పోక్సో, జువెనైల్ జస్టిస్‌ యాక్ట్‌ వంటి చట్టాల కింద గతవారం ఆ వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. ఈ క్రూరమైన నేర ప్రభావం ఆ బాలికపై జీవితాంతం ఉంటుందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 'ఒక తండ్రిగా ఆ చిన్నారిని కాపాడాల్సిన వ్యక్తే.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చేవరకు పైశాచికత్వాన్ని కొనసాగించాడు. దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేం. నేరానికి పాల్పడిన వ్యక్తి ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అతడిపై ఎలాంటి కనికరం చూపలేం' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
ఆ బాలిక తల్లి నిద్రిస్తున్న సమయంలోనో, ఆమె లేనప్పుడో ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అతడే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. కానీ తర్వాత ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం బయటపడిందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత మూడు నెలల గర్భాన్ని వైద్యులు తొలగించారు. డీఎన్‌ఏ పరీక్ష.. ఆ ఘటనకు కారకుడు ఎవరో ధ్రువీకరించింది. ఈ వివరాలన్నింటిని కోర్టు ముందు ఉంచడంతో ఈ సంచలన తీర్పు వెలువడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం