Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Karnataka
Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (17:07 IST)
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని కోడిహళ్లి గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దొడ్డ తాలూకా కోడిహళ్ళి గ్రామానికి చెందిన గాయత్రి (35) అనే వివాహితకు అదే ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ అలియాస్ గిడి (20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 
 
ఈ విషయం భర్తకు తెలిసింది. విషయం తెలిసిన ఉమేశ్‌ ప్రవర్తన మార్చుకోమని భార్యను హెచ్చరించాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవలయ్యేవి. దీంతో ఆయన్ను అడ్డుతొలగించుకునేందుకు తన ప్రియుడుతో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. ఇందుకోసం కిరణ్ కుమార్ తమ్ముడు సహాయం కూడా తీసుకున్నారు. ఈ హత్య 24వ తేదీన జరిగింది. 
 
తమ పథకం ప్రకారం కిరణ్‌ ఫిబ్రవరి 23వ తేదీన ఉమేశ్‌ను తాలూకాలోని తన స్వగ్రామం రాజఘట్టలో పని ఉందని తన బైక్‌పై తీసికెళ్లాడు. ఆరోజు ఇంట్లోనే ఉంచుకుని మరుసటిరోజు తన తమ్ముడితో కలిసి ఉమేశ్‌ను ఉజ్జిని సమీపంలోని అరణ్య ప్రాంతానికి తీసికెళ్లి వైర్‌తో గొంతు నులిమి, తర్వాత తలపై బండరాయితో మోది హతమార్చాడు. 
 
అనంతరం ఏం తెలీనివాడిలా తన పనిలో మునిగిపోయాడు. ఫిబ్రవరి 26న చన్నేగౌడ అనే వ్యక్తి ఉజ్జిని అరణ్యప్రాంతానికి వెళ్లగా కుళ్లిపోయిన శవం కనిపించింది. తక్షణం ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. కేసు నమోదు చేసుకున్న దొడ్డబెళవంగల పోలీసులు శవాన్ని గుర్తించి దర్యాప్తు చేయగా గాయత్రి గుట్టురట్టయింది. దీంతో క్షణికావేశానికిలోనై అక్రమ సంబంధం పెట్టుకుని గాయిత్రి, ప్రియుడు, ప్రియుడి తమ్ముడితో పాటు జైలుపాలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments