Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో వింత.. వర్షాల కోసం ఓ పిల్లాడిని నగ్నంగా చేసి.. తలమీద కుండలతో చల్లటి నీళ్ళు పోస్తూ..?

అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలామంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి పంటలు వేస్తున్నారు. కాని వరుణుడు ఏ మాత్రం కనికరం లేకుండా ముఖం చాటేశాడు. ఇకపోతే.. వ

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (16:07 IST)
అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలామంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి పంటలు వేస్తున్నారు. కాని వరుణుడు ఏ మాత్రం కనికరం లేకుండా ముఖం చాటేశాడు. ఇకపోతే.. వర్షాలు పడడానికి చాలామంది వరుణ దేవుడి పూజలు చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. 
 
మన దేశంలో ఇలా ఎన్నో మూఢనమ్మకాలు -దురాచారాలున్నాయి.  కానీ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పండరిహళ్లిలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి ఓ పిల్లాడిని నగ్నంగా ఊరమొత్తం ఊరేగించారు. చిత్రదుర్గలో ఈ ఏడాది సరైన పంటలు పండక కరువు సంభవించింది. వర్షాలు పడక, త్రాగడానికి మంచి నీళ్లు దొరక్క ట్యాంకర్లతోనే మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోంది. దాంతో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి అక్కడి గ్రామస్తులు ఓ పిల్లాడిని నగ్నంగా చేసి, అతడికి పూలు పెట్టి పూజించారు. 
 
అంతేకాకుండా వినాయకుడి విగ్రహం చేతికి ఇచ్చి, అది పట్టుకుని గ్రామంలో రోడ్లమీద తిరగాలని చెప్పారు. ఈ మూఢ నమ్మకాలు ఆ బాబుకి తెలియదు. పెద్దవాళ్లు చెప్పినట్లే చేశాడు. అతడు విగ్రహాన్ని గ్రామ శివార్లకు తీసుకెళ్లి అక్కడ నీటిలో నిమజ్జనం చేసి రమ్మన్నారు. అతడు కూడా అలాగే చేశాడు. అలా వెళ్తున్నంత సేపు ఊపి గ్రామస్థులు ఆ బాలుడి తల మీద కుండలతో చల్లటి నీళ్లు పోస్తూ వింత వింతగా ప్రవర్తించారు. తర్వాత పిల్లాడికి కొత్త బట్టలు కొనిచ్చారు. కాగా అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీయడంతో కర్ణాటక బాలల హక్కుల రక్షణ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం