మా ఎమ్మెల్యే ఒక్కొక్కరికి భాజపా రూ.100 కోట్ల ఆఫర్... కుమారస్వామి ఆరోపణ

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆఫర్ చేసిందని జేడీఎస్ లీడర్ కుమారస్వామి ఆరోపించారు. జేడీఎస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు భాజప

Webdunia
బుధవారం, 16 మే 2018 (13:54 IST)
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆఫర్ చేసిందని జేడీఎస్ లీడర్ కుమారస్వామి ఆరోపించారు. జేడీఎస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలతో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాము కర్నాటక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
 
మరోవైపు కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు కలుగుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా నలుగురు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనితో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు వారిని వెతికేపనిలో పడ్డారు. 
 
మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే వున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 8 సీట్లు మాత్రమే కావలసి వుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి దూరంగా వున్న 12 మంది సభ్యులు భాజపా నాయకులతో టచ్ లోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు కంటి మీద కనుకు లేకుండా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments