Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్టహాసంగా గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్లి.. ఐటీ కన్ను.. బీజేపీ నేతల డుమ్మా..

మైనింగ్ కింగ్‌ అని గుర్తింపు పొందిన గాలి జనార్ధన్ రెడ్డి తన రేంజ్‌కు తగ్గట్టు.. తన కూతురు బ్రాహ్మణి రెడ్డి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీడి

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (10:20 IST)
మైనింగ్ కింగ్‌ అని గుర్తింపు పొందిన గాలి జనార్ధన్ రెడ్డి తన రేంజ్‌కు తగ్గట్టు.. తన కూతురు బ్రాహ్మణి రెడ్డి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీడియో రూపంలో డిజిటల్ ఇన్విటేషన్ కార్డుని అతిథులకు ఆహ్వాన పత్రికగా పంపించి వార్తల్లోకెక్కిన గాలి జనార్ధన్ రెడ్డి.. ప్రస్తుతం పెళ్లి తంతుని కూడా అంతకుమించిన రేంజ్‌లో చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే పెద్ద నోట్ల రద్దుతో తలపట్టుకుని కూర్చున్నాడు. 
 
కూతురు పెళ్ళి కోసం బాలీవుడ్‌లో రిలీజైన దేవ్‌దాస్ సినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్స్‌తో మొత్తం రూ.150 కోట్లతో సినిమాటిక్ స్టైల్లో భారీ సెట్టింగులు సిద్ధం చేయిస్తున్న గాలి, అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఆహ్వానం తంతులో ఎవ్వరూ ఎక్కడ ఫోటోలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు సమాచారం.
 
దేశమంతా డబ్బు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా అంబరాన్నంటే సంబురంతో గాలి జనార్థన్ రెడ్డి జరిపిస్తున్న తన కుమార్తె వివాహం మాత్రం అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఈ పెళ్ళికి కొంతమంది బీజేపీ నేతలు డుమ్మాకొడుతున్నట్లు తెలిసింది. బీజేపీలో మాజీ మంత్రిగా పని చేసిన జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, రాజకీయ పెద్దలకు ఆహ్వానాలు పంపించారు.
 
అయితే, ఈ వివాహ కార్యక్రమానికి వెళ్లకుండా దూరంగా ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీకి చెందిన కొందరు నేతలకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ సూచనలు చేయనప్పటికీ ఆ వివాహానికి వెళ్లకుండా దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు తెలిసింది.
 
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేనందున గైర్హాజరు అయితే బాగుంటుందని చెప్పారట. కాగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఈ వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. కానీ కేంద్ర మంత్రులు మాత్రం గాలి కూతురు పెళ్ళికి డుమ్మా కొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments