Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడని.. చితక్కొట్టాడు.. ఒంటిపై నూలుపోగు లేకుండా?

ప్రేయసికి వేరొక వ్యక్తితో వివాహమైంది. ప్రేయసి కూడా పెళ్లైన తర్వాత ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుకోవడం ఆపలేకపోయింది. కానీ భర్తకు వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఫోన్‌లోనే ఆ భర్త భార్య ప్రియుడిని తిట్టిపోశాడు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (11:00 IST)
ప్రేయసికి వేరొక వ్యక్తితో వివాహమైంది. ప్రేయసి కూడా పెళ్లైన తర్వాత ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుకోవడం ఆపలేకపోయింది. కానీ భర్తకు వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఫోన్‌లోనే ఆ భర్త భార్య ప్రియుడిని తిట్టిపోశాడు. భార్యను హెచ్చరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ప్రియుడు.. తన ప్రియురాలి భర్తపై తీవ్రంగా దాడి చేశాడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆమెతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో అతనికి చెర్రెత్తుకొచ్చింది. 
 
అంతే త‌న ప్రియురాలి భ‌ర్త‌పై దాడి చేశాడు. న‌డిబ‌జారులో అత‌డి బ‌ట్ట‌లు విప్పి చిత‌క్కొట్టాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన బాధిత వ్య‌క్తిని రోడ్డు ప‌క్క‌న ప‌డేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బుర‌గిలో ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే మహేష్ క‌ల‌బుర‌గిలోని గాజిపురా లేఅవుట్‌లో త‌న భార్య శ‌శిక‌ళ‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. శ‌శిక‌ళ‌కు పెళ్లికి ముందే శివకుమార్ అనే యువకుడితో ప్రేమాయణం నడిపింది. కానీ అనివార్య కారణాల వల్ల మహేష్‌తో ఆమె వివాహం జరిగిపోయింది. వీరిద్ద‌రి పెళ్ల‌యి ఆరేళ్ల‌యింది. అయిన‌ప్ప‌టికీ శివ‌కుమార్ త‌ర‌చూ శ‌శిక‌ళ‌తో ఫోనులో మాట్లాడేవాడు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఆమెను మందలించాడు. 
 
త‌న భార్య‌కు ఫోన్ చేయొద్ద‌ని ఆమె ప్రియుడిగా గట్టిగా హెచ్చ‌రించాడు. దీనితో ఆగ్ర‌హించిన శివ‌కుమార్‌.. మహేష్‌పై దాడి చేశాడు. క‌లబుర‌గిలో న‌డిరోడ్డుపై మ‌హేష్‌ను ప‌ట్టుకుని చిత‌గ్గొట్టాడు. బ‌ట్ట‌లు విప్పించి, దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా, బాధ‌తో విల‌విల‌లాడుతున్న మ‌హేష్‌ను స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments