Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం అమ్మాయిని లేపుకెళ్లాడనీ.. యువకుడి తండ్రి, అన్నకు శిక్ష

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించక పోవడంతో లేపుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తరపువారు యువకుడి తండ్రికి, అ

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (15:35 IST)
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించక పోవడంతో లేపుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తరపువారు యువకుడి తండ్రికి, అన్నను చెట్టుకు కట్టేసికొట్టారు. ఈ దారుణం కర్ణాటకలోని బీజాపుర జిల్లా సింధగి తాలూకా హాళగుండకనాళ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన నింగప్ప, మాషాబీ అనే యువతీ యువకులు గతకొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. మతాలు వేరు కావడంతో మాషాబీ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. తమ ప్రేమను అంగీకరించే పెద్దమనసు పెద్దలకు లేదని భావించిన వారిద్దరూ పారిపోయారు.
 
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాషాబీ తండ్రి అల్లాభక్ష్‌ తన ఏడుగురు బంధువులతో కలిసి నింగప్ప తండ్రిని గ్రామంలోని చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నింగప్ప సోదరుడు రమేశ్‌ తన తండ్రిని విడిపించేందుకు అక్కడికి వెళ్లగా, అతన్ని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో కలకేరి పోలీసులు వచ్చి వారిని విడిపించి, ఆసుపత్రిలో చేర్చారు. నిందితులపై కేసు నమోదు చేశారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments