Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:45 IST)
క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కొన్ని క‌ళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావ‌డంపై జ‌నవ‌రి చివ‌రి వారంలో ప్రారంభ‌మైన వివాదం చినికి చినికి గాలి వాన‌లా మారింది. మంగ‌ళ‌వారం ఉడుపి, మాండ్య త‌దిత‌ర జిల్లాల్లో విద్యార్థి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నెల‌కొన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో స్పందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు మూడు రోజులు సెలవులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  
 
కాగా.. ఈ వివాదంపై సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎంఎన్ఎం) అధ్య‌క్షుడు క‌మ‌లహాస‌న్ స్పందించారు. ఈ వివాదం విద్యార్థుల మ‌ధ్య మ‌త విద్వేషంగా మారుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం స‌హా అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుకుంటున్నా అని క‌మ‌ల్ హాస‌న్ ట్వీట్ చేశారు. 
 
ఈ వివాదం అమాయ‌క విద్యార్థుల మ‌ధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయని కమల్ హాసన్  పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతోన్న ఇటువంటి ప‌రిణామాలు త‌మిళ‌నాడు వ‌ర‌కు పాకకుండా చూసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments