కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (16:50 IST)
తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్‌కు కర్నాటక హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి అంత నామోషీనా అంటూ ప్రశ్నించింది. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కర్నాటక సినీ రాజకీయ, ప్రజా సంఘాలు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాయి. ఇదే అంశంపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది.  
 
ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్‌కు కోర్టు తేల్చి చెప్పింది.
 
'మీరు సామాన్యులు కారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం.. మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పండి' అని కోర్టు పేర్కొంది. 
 
కాగా, కమల్ హాసన్ కొత్త సినిమా 'థగ్ లైఫ్' గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, "కర్ణాటక నుంచి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు... కానీ కన్నడ ప్రజలు వద్దనుకుంటే ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments