Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్య ప్రియుడి మొబైల్ విశ్లేషించాలన్న భర్త.. కుదరదన్న హైకోర్టు

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (09:17 IST)
తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అందువల్ల ఆమె ప్రియుడి మొబైల్ ఫోనును విశ్లేంచాలంటూ ఓ భర్త చేసిన అభ్యర్థనను కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. అలా పరిశీలించడం వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లఘించడమే అవుతుందని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకు చెందిన ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇప్పించాలని కోరుతూ గత 2018లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అతడి సెల్‌ఫోల్ సమాచారాన్ని పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందని వాదించారు. దీంతో భార్య ప్రియుడిగా చెబుతున్న వ్యక్తి కోర్టుకెక్కాడు. 
 
తన ఫోన్ కాల్స్ వివరాలు కోరడాన్ని సవాలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం భార్యాభర్తల విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది ఆ వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు జడ్జి ఎం.నాగప్రసన్న తన తీర్పులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments