Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సారీ అప్పు.. నేను హర్ట్ చేయను' అంటూ నిద్రమాత్రలు మింగిన యువతి

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరుకు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మాట్లాడలేదని నిద్రమాత్రలు మింగి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తుముకూరుకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఓ అప్పు అనే య

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (15:38 IST)
కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరుకు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మాట్లాడలేదని నిద్రమాత్రలు మింగి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తుముకూరుకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఓ అప్పు అనే యువకుడిని ప్రేమించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో గత కొద్ది రోజులుగా మాటలు లేవు. దీంతో ఆ యువతి తెగ బాధపడిపోయింది. తాను చనిపోతున్నానని 10కి పైగా ట్యాబ్లెట్లు మింగి అప్పుకి వీడియో వాట్సప్‌లో పంపింది.
 
అందులో "సారీ అప్పు.. అయామ్ సో సారీ.. నేను ఎవ్వరినీ హర్ట్ చేయాలని అనుకోలేదు.. నేను హర్ట్ చేయను కూడా.." అంటూ బాయ్ ఫ్రెండ్‌కు వీడియో పంపింది. అందులో ఆమె నిద్రమాత్రలు మింగుతూ కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన అప్పు హాస్టల్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే వారు స్పందించి ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆ యువతికి ఎటువంటి ప్రాణహాని కూడా లేదని వైద్యులు తెలిపారు. ప్రాణాలంటే లెక్కలేకుండా పోతున్నాయన్నదానికి ఇదో ఉదాహరణ. బాయ్ ఫ్రెండ్ మాట్లాడకపోతే కూడా ప్రాణాలు తీసుకోవాలని అనుకోవడం మూర్ఖత్వపు చర్యగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments