దళితులపై హింస-98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:15 IST)
కర్ణాటక మరకుంబి గ్రామంలో దళితులపై హింసాత్మక దాడికి పాల్పడినందుకు కొప్పల్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించింది. 
 
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషులపై అభియోగాలు మోపారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి సి చంద్రశేఖర్ మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. 
 
గంగావతి రూరల్ పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో మొదట 117 మంది పేర్లను నమోదు చేశారు. అయితే కొంతమంది నిందితులు మరణించారు. ఛార్జ్ షీట్‌లో కొందరి పేర్లు పునరావృతమయ్యాయి. 
 
చివరకు 101 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. హింసాత్మక సంఘటన ఆగష్టు 29, 2014న, గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామం జరిగింది. ఈ సందర్భంగా అగ్రవర్ణాల వ్యక్తుల గుంపు ఎస్సీ కమ్యూనిటీ సభ్యులపై దాడి చేసి, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments