Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడు మగాడ్రా బుజ్జీ...కమల్, రజినీలపై గుర్రుగా ఉన్న అభిమానులు..

జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (13:45 IST)
జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు వెనక్కి తగ్గి రాజకీయాల్లోకి వెళ్ళడం పూర్తిగా మానేసినట్టున్నారు. రజినీ విషయం పక్కనబెడితే మరో నటుడు కమల్ హాసన్ కూడా అదే ఊపును మొదట్లో ప్రదర్శించాడు.
 
తమిళనాడులో నెలకొన్న సమస్యలపై తాను రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తేనే మంచిదన్న నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక అందరూ కమల్ హాసన్ ఒకటిరెండు రోజుల్లో పార్టీ పెట్టేస్తారని అనుకున్నారు. కానీ కమల్ కూడా రజినీ బాటలోనే నడిచాడు. ఊరించి ఉసూరుమనిపించాడు. అయితే కన్నడ నటుడు ఉపేంద్ర మాత్రం తాను అనుకున్న విధంగానే పార్టీ పెట్టేశాడు. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగానే పార్టీ గుర్తును గీసి ఏకంగా రాజకీయ పార్టీకే పురుడు పోశాడు. ఇప్పుడంతా కన్నడ, పక్కనే ఉన్న తమిళ రాజకీయాలంతా ఉపేంద్ర చుట్టూ తిరుగుతోంది.
 
ఉపేంద్ర పార్టీ పెట్టిన తరువాత అటు కమల్ ఇటు రజినీ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీ పెడతామని ఇప్పటివరకు పెట్టని తమ అభిమాన హీరోలపై గుర్రుగా ఉన్నారు. ఉపేంద్రను ఆదర్శంగా తీసుకోనైనా కమల్, రజినీలు  పార్టీ పెట్టాలని కోరుతున్నారు. అయితే అభిమానుల మొరను ఈ హీరోలు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments