Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

శృతి హాసన్ మేకప్ తీసేస్తే జడుసుకుంటాం... చండాలం... అందగత్తెలిక్కడున్నారు...

డబ్బింగ్ చిత్రాలనే బ్యాన్ చేయగలిగిన కన్నడిగుల ఆత్మగౌరవం ఏమిటో స్టార్ జగ్గేష్ నిరూపించాడు. అందునా అది తనకు సంబంధం లేని విషయం. తాజాగా కన్నడ నిర్మాత ఒకరు తన చిత్రంలో శృతి హాసన్ నటిస్తోందని ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన శృతి హాసన్ వెనువెంటనే తను ఏ కన్నడ చిత్

Advertiesment
Kannada Star
, గురువారం, 12 అక్టోబరు 2017 (20:03 IST)
డబ్బింగ్ చిత్రాలనే బ్యాన్ చేయగలిగిన కన్నడిగుల ఆత్మగౌరవం ఏమిటో స్టార్ జగ్గేష్ నిరూపించాడు. అందునా అది తనకు సంబంధం లేని విషయం. తాజాగా కన్నడ నిర్మాత ఒకరు తన చిత్రంలో శృతి హాసన్ నటిస్తోందని ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన శృతి హాసన్ వెనువెంటనే తను ఏ కన్నడ చిత్రంలోనూ చేయడంలేదనీ, బాలీవుడ్ లోనే ఏలిన దాన్ని తను ఎప్పుడూ కన్నడలో చేయనని తూలనాడింది. 
 
అంతే... నటుడు జగ్గేష్‌కు శృతి మాటలకు మండింది. శృతి హాసన్ కంటే అందగత్తెలు కర్ణాటకలో కన్నడిగుల్లో ఎందరో వున్నారు. శృతి హాసన్ ను మేకప్ లేకుండా చూడలేం. మేకప్ కనుక తీసేస్తే జడుసుకుంటాం. అంత చండాలంగా వుంటుందని డైరెక్టుగా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మన రాష్ట్రంలోని, మన భాషా హీరోయిన్లను ఎంకరేజ్ చేయకుండా శృతి హాసన్ వంటి పొగరుబోతుల చుట్టూ తిరగడం మన కన్నడ దర్శకనిర్మాతలు చేస్తున్న తప్పనీ, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని పౌరుషంగా బతకాలని ఆవేశంగా స్పందించాడు. 
 
ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు కన్నడ నాట అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటో... అలియా భట్, మహేష్ బాబుతో చేస్తారని అనుకుంటారంటూ ఒకరు ప్రశ్నిస్తే... అసలు మహేష్ బాబు ఎవరో తనకు తెలియదని ఎద్దేవా చేసింది. ఇక తాప్సీ అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు హీరోయిన్ల బొడ్డుపై కొబ్బరి చిప్పలు వేయడం తెలుసంటూ తూలనాడింది. కానీ మనవాళ్లు మాత్రం ఎంతమాత్రం స్పందించరు. కన్నడ ఇండస్ట్రీని చూసైనా ఇక్కడి హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జునతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన కొత్త పెళ్లికూతురు సమంత.. (వీడియో)