Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటకలో పవన్ పార్టీ క్సెరాక్స్... స్థాపించబోయేది ప్రముఖ నటుడే...

వైవిధ్యమైన చిత్రాలతో అటు కన్నడ, ఇటు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లోకి రానున్నారు. సొంత పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే పార్టీ పెట్టబోతున్నారు ఉపేంద్ర. ఇప్పటికే రాజకీయ

Advertiesment
కర్నాటకలో పవన్ పార్టీ క్సెరాక్స్... స్థాపించబోయేది ప్రముఖ నటుడే...
, ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:58 IST)
వైవిధ్యమైన చిత్రాలతో అటు కన్నడ, ఇటు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లోకి రానున్నారు. సొంత పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే పార్టీ పెట్టబోతున్నారు ఉపేంద్ర. ఇప్పటికే రాజకీయ సలహాదారులు, కర్ణాటకలోని కొన్నిపార్టీలకు చెందిన సీనియర్ నేతలతో ఉపేంద్ర చర్చలు కూడా జరిపారు. ఎపిలో పవన్ కళ్యాణ్‌ ఎలాగైతే పార్టీ పెట్టి ప్రకటనలు చేస్తున్నారో..అలాగే ఉపేంద్ర కూడా పవర్ కోసం కాదు.. ప్రశ్నించడానికే అన్న నినాదాంతో పార్టీ పెట్టబోతున్నారు. అయితే పార్టీ పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
 
విలక్షణ నటుడు ఉపేంద్ర తెలుగులో ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి సినిమాల్లో నటించారు. స్వతహాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈయన కన్నడ సినిమాల్లో నటించి ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో తెలుగు, తమిళ బాషల్లో కూడా నటించి అంతే మంది అభిమానులకు చేరువయ్యారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని ఉపేంద్ర అనుకోలేదు. అయితే గత కొన్నినెలలుగా కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉపేంద్ర రాజకీయాల్లోకి రావాలనుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఉపేంద్రకు కర్ణాటక రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ నమ్మకంతోనే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారట. మొదటగా ప్రజల్లోకి వెళ్ళాలి.. అధికారం కోసం కాదు.. ప్రజా సమస్యలను ప్రశ్నించడానికే అని ఉపేంద్ర చెబుతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే కర్ణాటక రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడు పోసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నర్సులే డెలివరీ చేశారు.. కవలలు పుట్టారు.. అంబులెన్స్ అందకపోవడంతో..